News November 30, 2025

ప్రముఖ కమెడియన్ కన్నుమూత

image

ప్రముఖ కన్నడ కమెడియన్ MS ఉమేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1960లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేశ్ ఇప్పటివరకు 350కి పైగా చిత్రాల్లో నటించారు. 6 దశాబ్దాలపాటు కన్నడ పరిశ్రమకు సేవలందించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, కేంద్ర మంత్రి కుమారస్వామితోపాటు నటీనటులు నివాళులర్పించారు.

Similar News

News February 17, 2026

BREAKING: హైదరాబాదీలకు ఇందిరమ్మ ఇళ్లు

image

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ‘మురికివాడల్లో 5-10 అంతస్తుల్లో ఇళ్లు నిర్మిస్తాం. KPHB లాగా RRR- ORR మధ్య మిడిల్ క్లాస్ వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్‌లకు నిధులు మంజూరు చేస్తాం. సొంత స్థలం ఉన్న 28వేల మందికి ఈ నెలలో ఇళ్లు మంజూరు చేస్తాం’ అని అన్నారు.

News February 17, 2026

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

image

TG: HYD, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మార్చి చివరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘నిరుపేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాల్లో 5-10 అంత‌స్తుల్లో గృహాల నిర్మాణానికి యోచిస్తున్నాం. పూర్త‌యిన‌ డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లకూ అర్హులను ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.

News February 17, 2026

కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్

image

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.