News August 20, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 23, 2026
నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.
News January 23, 2026
సంగారెడ్డి: ఇంటర్ హాల్ టికెట్లు సరి చూసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ హాల్ టికెట్లు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సూచించారు. http://tgbie.cgg.gov.inలో హాల్ టికెట్ చూసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీలోపు సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 23, 2026
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.


