News November 21, 2024
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబునాయుడును జిల్లా ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 3, 2024
రాయితీపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి: నంద్యాల కలెక్టర్
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం నంద్యాల పీజిఆర్ఎస్ హాలులో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్నవారు www. pmsuryaghar.gov.in/ APSPDCL వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.
News December 2, 2024
భూ వివాదాల కేసులు పరిష్కరించడం లేదు: కర్నూలు కలెక్టర్
రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ వివాదాల కేసులు పరిష్కరించడం లేదని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెవెన్యూలో ఎక్కువ శాతం రీఓపెనింగ్ జరుగుతున్నాయని అన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News December 2, 2024
నంద్యాల వద్ద రైలు ఢీకొని విద్యార్థి మృతి
రైలు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీశ్ అనే యువకుడు సోమవారం బొమ్మల సత్రం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.