News September 11, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భాద్రపద మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులున్నారు.

Similar News

News December 7, 2025

ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు

image

మెదక్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలో పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ రోజు బయలుదేరి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏ.ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను రూపకల్పన చేస్తారని తెలిపారు.

News December 7, 2025

గోపా పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

గౌడ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం జ్యోతినగర్‌ ఏరియాలో ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మండ రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా బందారపు యాదగిరి, కోశాధికారిగా కొక్కిస దేవేందర్‌, ఉపాధ్యక్షులు వీరగోని శ్రీనివాస్‌, అడ్డగుంట రాజేందర్‌, బాలసాని స్వామి, మేడగోని రాజమౌళితోపాటు పలువురిని ఎన్నుకున్నారు.