News December 2, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

Similar News

News February 16, 2026

చిత్తూరు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

కార్వేటినగరం M) తురక మిట్ట వద్ద సోమవారం కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న దేవకి అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, క్షతగాత్రులను CHC ఆసుపత్రికి తరలించారు. సదాశివకోనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News February 16, 2026

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

image

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.

News February 16, 2026

విశాఖ డెయిరీ పాల రేట్లు ఎంత పెరిగాయంటే..

image

విశాఖ డెయిరీ పాల అమ్మకం ధరలను పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. అర లీటర్ హోమోజినైజ్డ్ డబుల్ డోన్డ్ పాలు ధర రూ.26 నుంచి రూ.27కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాల ధర అర లీటరు రూ.28 నుంచి రూ.29కు పెంచింది. స్టాండర్ డైజ్డ్ పాలు అర లీటరు రూ.31 నుంచి రూ.32కు, ఫుల్ క్రీం పాలు లీటరు రూ.66 నుంచి రూ.68కు పెరిగింది.