News August 11, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శ్రావణ మాసం విదియ తిథి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News March 6, 2026

చిత్తూరు SE కీలక ఆదేశాలు

image

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.

News March 6, 2026

బాపట్ల: స్కూల్‌లో అలజడి.. HMపై కులవివక్ష ఆరోపణలు

image

కర్లపాలెం మండలంలోని పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదం ముదరడంతో విషయం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2026

మైనర్లకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

image

మైనర్లకు SMను బ్యాన్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. APలో కూడా ఈ తరహా విధానంపై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించడం అత్యవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజర్లు వీటి బారినపడి అశ్లీలత, సమయం వృథా, చెడు అలవాట్లకు గురవుతున్నారని అంటున్నారు.