News November 17, 2025
ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. ధరలు ఇలా..!

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.18 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.15,700 కి చేరింది. కాగా, నేడు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు తెలుపడంతో మార్కెట్‌కు పత్తి రాలేదు.
Similar News
News January 24, 2026
పిల్లల ముందు గొడవ పడితే..

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు పెరిగాయి. దీంతో పిల్లలపై ఇంట్లో వాతావరణం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు, అక్రమ సంబంధాలు వంటివి ఉంటే ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని fcfcoa అధ్యయనంలో వెల్లడైంది. ఇవి వారి జీవన నైపుణ్యాలను దెబ్బతీయడంతో పాటు ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
News January 24, 2026
మంచిరోని మామిళ్లలో పెద్దపులి కలకలం..!

తుర్కపల్లి మండలంలోని మంచిరోని మామిళ్ల గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తుండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ సమీపంలోని బావి వద్ద పులిని చూసినట్లు ఓ బాటసారి తెలపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పాదముద్రలను సేకరించి అది పులేనా లేక ఇతర క్రూర మృగమా అని నిర్ధారించే పనిలో పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News January 24, 2026
VJA: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.


