News September 10, 2025

ప్రేమ పేరుతో యువతికి కడుపు.. పెళ్లి చేసుకోమంటే.!

image

ప్రేమపేరుతో యువతిని మోసం చేసి పెళ్లి చేసుకోమంటే మొహం చాటేసిన ఘటన ఇది. పూతలపట్టుకు చెందిన నాజుణ్ణి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంది. ఆమెకు తిరుపతి ఆటో నగర్‌కు చెందిన వినయ్ కుమార్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వారు శారీరకంగా దగ్గర కావడంతో ఆమె గర్భవతి అయింది. ‘పెళ్లి చేసుకోమంటే నీ కడుపులో బిడ్డకు DNA టెస్ట్ చేసి రా, అప్పుడు కాపురం చేస్తా’ అన్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Similar News

News December 5, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

NH 161పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అల్లాదుర్గ్ కాయిదంపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేట్ మండలం మునిగేపల్లికి చెందిన కారు డ్రైవర్ సోయల్(25) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన సోయల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

News December 5, 2025

ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

image

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

News December 5, 2025

HNK: సబ్ పోస్ట్ ఆఫీసులకు మంగళం

image

కనీస ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో హనుమకొండ నగరంలోని 3 సబ్ పోస్టాఫీసులను తరలిస్తున్నారు. హనుమకొండ డివిజన్ పరిధిలోని లష్కర్ బజార్, నయూంనగర్, బాపూజీ నగర్ సబ్ ఆఫీసులను రద్దు చేసి వాటిని ఇతర జిల్లాలకు కేటాయించారు. ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ లేని కారణంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు మంగళం పాడారు. తాజాగా 3 సబ్ ఆఫీసులు రద్దు కాగా.. త్వరలోనే హనుమకొండలోని మరో రెండు సబ్ పోస్టాఫీసులు రద్దు కానున్నాయి.