News November 19, 2025

ప్రేమ, సేవలకు ప్రతిరూపం సాయిబాబా: CBN

image

AP: ప్రేమ, సేవలకు ప్రతిరూపం సత్యసాయి అని CM CBN అన్నారు. ‘ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవం సాయి. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి బోధించి ఆచరించారు. సాయిలో సమ్మోహనశక్తి ఉంది. నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారు. మనోదర్శనంతో ప్రభావితం చేశారు’ అని తెలిపారు. దేశాధినేతల వరకు అందరూ ఆయన అనుగ్రహం పొందారని చెప్పారు. కోట్ల నిధులు విరాళంగా అందించడమే కాక ఆస్తుల్ని వదిలి సాయి సన్నిధిలో గడిపారని వివరించారు.

Similar News

News January 14, 2026

మరో 9 అమృత్‌ భారత్‌ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

image

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.

News January 14, 2026

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం

News January 14, 2026

సంక్రాంతి ప్రతిసారి ఒకే తేదీన ఎందుకు వస్తుంది?

image

దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్‌లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే JAN 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.