News August 6, 2024
ప్రైవేటీకరణ జాబితాలో తిరుపతి విమానాశ్రయం

కేంద్రం రూపొందించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో దేశవ్యాప్తంగా చేర్చిన 25 విమానాశ్రయాల్లో తిరుపతి ఉన్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికే లీజుకు ఇస్తున్నామన్నారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని AAI దేశంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్‌ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
ఫోన్ నంబర్ల బోర్డులు పెట్టండి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ప్రదేశాల్లో ఆసుపత్రులు, డాక్టర్ల ఫోను నెంబర్ల వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ హైవేల్లో చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.


