News April 1, 2024

ప్రొద్దుటూరులో 23 మంది వాలంటీర్ల రాజీనామా

image

పింఛన్ల పంపిణీ వ్యవస్థపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని 28, 30వ వార్డు సచివాలయాల్లోని 23 మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వార్డు కార్యదర్శికి అందజేశారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకునేందుకే తాము ప్రచారం చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు.

Similar News

News February 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.

News February 12, 2026

కడప: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

image

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.

News February 12, 2026

మంత్రికి విన్నవించుకున్న MP అవినాశ్ రెడ్డి

image

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.