News March 21, 2024
ప్రొద్దుటూరు: వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ప్రొద్దుటూరు 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఇంటిలో బుధవారం వరదరాజుల రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కౌన్సిలర్ వైఎస్ మహమూద్ గౌస్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Similar News
News February 15, 2025
ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
News February 15, 2025
కడప: రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?

మోదీజీ.. ఢిల్లీలో బీజేపీ కార్యాలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి కృషి చేయడం లేదని విమర్శించారు.
News February 15, 2025
జిల్లాను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలి: కడప కలెక్టర్

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర సాధనలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణాలను స్వచ్ఛతకు ప్రతీకలుగా తీర్చిదిద్దాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రతి నెలా 3వ శనివారం చేపట్టే “స్వచ్ఛ దివస్” కార్యాచరణపై వీసి ద్వారా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో, ఇళ్లలో “స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని విధిగా, బాధ్యతగా నిర్వహించాలన్నారు.