News August 3, 2024

ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం అవగాహన కార్యక్రమలో ఆయన మాట్లాడారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్లాస్టిక్ నియంత్రణలో కృషి చేశారని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, గ్రామాలకు, పట్టణాలకు వచ్చే దారుల వెంబడి ప్లాస్టిక్, చెత్త కనిపించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

కరీంనగర్ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

image

కరీంనగర్ జిల్లా జీపీవో అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉట్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయప్రసాద్, ఉపాధ్యక్షులుగా నూనె రమేష్, సాగర్, అనిల్, కోశాధికారి హరీష్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ గా నలువాల సాయికిషోర్, నీర్ల రేవంత్, జెట్టి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా పెంటి మమత, ఉపాధ్యక్షురాలుగా చందన, వనితలు ఎన్నికయ్యారు. తహశీల్దార్ బండి రాజేశ్వరి నూతన కమిటీని అభినందించారు.

News December 7, 2025

కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

News December 7, 2025

కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు RM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. DEC 12న KNR బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, DEC 13న పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. DEC 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు KNR చేరుకుంటుందన్నారు. వివరాలకు డిపోను సంప్రదించాలన్నారు.