News April 23, 2025

ప.గో: అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

భవ్య భీమవరం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయం‌లో కలెక్టర్ భవ్య భీమవరం సుందరీకరణ, మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల పురోగతి, ఇంకా చేపట్టవలసిన పనులపై మున్సిపల్ అధికారులు,దాతలతో సమావేశమై సమీక్షించారు. కాస్మో పోలిటన్ క్లబ్ వద్ద వంశీకృష్ణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.

Similar News

News March 9, 2026

ప.గో: నేడు జిల్లాకు షర్మిల రెడ్డి

image

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం సంత మార్కెట్లో ఉపాధి హామీ కూలీలతో చర్చిస్తారని, అనంతరం 3 గంటలకు భీమవరం ప్రకాశం చౌక్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని జిల్లా అధ్యక్షుడు సీతారామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉపాధి హామీ కూలీలు పాల్గొంటారని అన్నారు.

News March 9, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’: ఎస్పీ

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

News March 8, 2026

పగో:జిల్లాలో.. జోరుగా బెట్టింగ్..

image

ఉమ్మడి జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతోంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరును ఆసరాగా చేసుకుని బుకీలు పడగ విప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెట్‌వర్క్ విస్తరించి, యాప్‌ల ద్వారా యువతకు వల వేస్తున్నారు. రూపాయికి పది వస్తాయని ఆశచూపుతూ బంతి బంతికీ పందాలు కాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే వ్యామోహంతో మధ్యతరగతి యువత, విద్యార్థులు ఈ ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారు.