News December 13, 2024
ప.గో జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం: కలెక్టర్
ప.గో జిల్లాలో శుక్రవారం నుంచి 2025 జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. భీమవరం డివిజన్‌లో 119, నరసాపురం డివిజన్ 111, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిలో డివిజన్ల వారీగా భీమవరం 6, నరసాపురం 12, తాడేపల్లిగూడెంలో 7 సదస్సులు ప్రారంభిస్తున్నామన్నారు.
Similar News
News January 20, 2025
లక్కవరంలో మామిడి తోటలో పార్టీ..ఆరుగురు అరెస్ట్
జంగారెడ్డిగూడెం(M) లక్కవరం శివారులో మామిడి తోటలో అల్లరి సృష్టిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకుంటూ అల్లర్లు చేస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. 23 తెలంగాణ మద్యం సీసాలు, 5 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేయగా నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య
ఉమ్మడి ప.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 20, 2025
ఈనెల 20 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు: కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు.