News January 23, 2025
ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Similar News
News February 12, 2025
ప.గో జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ .240 వరకు విక్రయించిన చికెన్ , ప్రస్తుతం రూ. 160 నుంచి రూ. 180 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు ఇప్పటికే నిలిపివేయగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.
News February 12, 2025
ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
News February 12, 2025
యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.