News March 27, 2024
ప.గో.: భౌతికశాస్త్ర ఆచార్యుడి పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు

తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న మాచవరపు రాముడు చేసిన పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ‘స్పింట్రానిక్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫేరో మ్యాగ్నెంట్ హ్యుస్లర్’ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనికి గాను జాతీయస్థాయి గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25లక్షలు కేటాయించింది.
Similar News
News February 16, 2026
నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌పై కేసు

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
News February 16, 2026
ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.
News February 16, 2026
నేడు యథావిధిగా PGRS

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.


