News May 23, 2024

ప.గో: రైలు పట్టాలపై మహిళ మృతదేహం

image

నిడదవోలు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య నిన్న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడి ఉన్నట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. దారవరం రైల్వే గేటు సమీపంలో డౌన్ లైన్ పక్కన మహిళ మృతదేహం లభ్యమైందని, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. వివరాలేమీ లభ్యం కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

ఈ తేదీల్లో చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

image

యలమంచిలి(M) చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. మార్చి 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వంతెనపై ఎటువంటి వాహనాలను అనుమతించరు. తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా తేదీల్లో ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.

News March 11, 2026

ప.గో: ఇక్కడే ఆడుకున్నాడు.. దేశానికి కీర్తి తెచ్చాడు

image

టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మ విజయం పట్ల అతడి అమ్మమ్మ ఊరు ఉండి మండలం వాండ్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనవడి అద్భుత ప్రతిభను చూసి తాతయ్య సుబ్బరాజు, అమ్మమ్మ సుందరమ్మ అమితానందం వ్యక్తం చేశారు. చిన్ననాడు తమవద్దే ఆడుకున్న బిడ్డ నేడు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు మనసారా ఆకాంక్షించారు.

News March 11, 2026

ప.గో: గ్యాస్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

image

గ్యాస్ బుకింగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు సిలిండర్ ధరలు పెరగగా మరోవైపు గతంలో సింగిల్ బండ 15 రోజులు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ బండ ఓనర్ 25 రోజుల తర్వాత, డబుల్ బండ వారు 30రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధన భారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.