News January 11, 2025
ప.గో: విమాన ధరలతో పోటీ పడుతున్న బస్సు ధరలు
సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3వేల నుంచి 5 వేలకు పెరిగాయి.
Similar News
News January 19, 2025
టి. నరసాపురంలో బాలిక అనుమానాస్పద మృతి
టి.నరసాపురంలో బాలిక మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలానికి చెందిన బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే బాత్ రూమ్‌కి అని వెళ్లిన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు చింతలపూడికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News January 19, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో రూ. 120 కోట్ల మద్యం విక్రయాలు
ఉమ్మడి ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులూ వైభవంగా జరిగాయి. అదే రీతిలో మద్యం ప్రియులు మద్యం కోసం ఎగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు , స్నేహితులు పండుగకు ముందుగానే పల్లె బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 120 కోట్లకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
News January 19, 2025
భీమవరం: వ్యక్తి కిడ్నాప్‌లో ట్విస్ట్
భీమవరంలో ఈనెల 16న వెంకట సత్యనారాయణ(నాని) కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌కు అనంతపురం వాసులు ఇద్దరితో ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. నానిని కిడ్నాప్ చేసి బకాయిలు వసూలు చేయాలని పథకం వేశారు. రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని ఇంటిలిజెన్స్ పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు. నాని కుమారుడి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. త్వరలో నిందితులను చూపించే ఛాన్స్ ఉంది.