News May 21, 2024
ప.గో: స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
భీమవరంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత కలిసి సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలను జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల పరిధిలో మూడు అంచల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
Similar News
News December 13, 2024
ఉమ్మడి ప.గో. రైతులకు ఇది తెలుసా?
ప.గో.జిల్లాలో మామిడి, కొబ్బరి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని మీకు తెలుసా? మామిడి ఎకరాకు రూ.2250 చెల్లిస్తే రూ.45 వేలు.. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3.50 కడితే రూ.900 చొప్పున PM ఫసల్ బీమా యోజన కింద రైతులకు పరిహారం అందిస్తారు. డిసెంబర్15 నుంచి మే31 మధ్యలో వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బీ పత్రాలతో డిసెంబర్ 15లోగా మీసేవలో నమోదు చేసుకోవాలి.
News December 13, 2024
నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ సస్పెండ్
వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై నరసాపురం ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఎంవీటీ ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఓ భూమికి అడంగళ్ రికార్డులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక దర్యాప్తు చేయగా.. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
News December 13, 2024
ప.గో జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం: కలెక్టర్
ప.గో జిల్లాలో శుక్రవారం నుంచి 2025 జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. భీమవరం డివిజన్‌లో 119, నరసాపురం డివిజన్ 111, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 90 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిలో డివిజన్ల వారీగా భీమవరం 6, నరసాపురం 12, తాడేపల్లిగూడెంలో 7 సదస్సులు ప్రారంభిస్తున్నామన్నారు.