News March 11, 2025

ఫార్ములా ఈ రేసింగ్ ముమ్మాటికీ లొట్ట పీస్ కేసే :మంత్రి కేటీఆర్

image

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో తనకు మళ్లీ నోటీసులు పంపిస్తారని, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, 17న తనకు నోటీసులు ఇస్తారని ఆయన అన్నారు. తనను విచారణకు పిలిచి నాటకాలు ఆడే అవకాశముందని, ఫార్ములా రేసింగ్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు రూ. 45 కోట్లు ఖర్చు చేస్తే తప్పు అని చెప్పారని అన్నారు.

Similar News

News April 16, 2026

నల్గొండ: జనరల్ మహిళా స్థానాలపై ఎమ్మెల్యేల భార్యల కన్ను

image

నియోజకవర్గాల పునర్విభజనలో నకిరేకల్, తుంగతుర్తి స్థానాలు జనరల్‌గా మారే అవకాశం ఉందన్న ప్రచారంతో ఉమ్మడి నల్గొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ల అంచనాలతో కీలక నేతల భార్యలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వేముల వీరేశం భార్య పుష్పారెడ్డి, గాదరి కిశోర్ భార్య కమల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

News April 16, 2026

RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

image

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News April 16, 2026

శ్రీకాకుళం: సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులు సూచించారు. రీ వెరిఫికేషన్ కు సైతం 20 వ తేదీ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.