News March 12, 2025

ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చే ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News February 19, 2026

నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

News February 19, 2026

తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

image

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.

News February 19, 2026

KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్‌ విశిష్టత ఇదే..

image

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.