News March 5, 2025

ఫిర్యాదులకు సమగ్ర పరిష్కారం చూపండి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌కు వచ్చే ప్రతి సమస్యకు సమగ్ర పరిష్కారం చూపాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల స్థాయి అధికారులతో ఫిర్యాదులపై సమీక్ష చేశారు. మండల స్థాయిలో కచ్చితంగా అధికారులు ఫిర్యాదుదారునితో మాట్లాడి నివేదిక ఇవ్వాలన్నారు. కొందరు ఫిర్యాదుదారులతో నేరుగా కలెక్టర్ మాట్లాడారు. ఫిర్యాదులపైపోలీస్ అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News December 11, 2025

చీన్యా తండా సర్పంచ్‌గా జాటోత్ హరిచంద్

image

మహబూబాబాద్ జిల్లాలోనే తొలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫలితం వెలువడింది. ఇనుగుర్తి మండలం చీన్యా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. హరిచంద్‌కు 117 ఓట్లు రాగా.. ప్రత్యర్థి జాటోత్ శ్రీనుకు 108 ఓట్లు వచ్చాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 228 ఓట్లు పోలవగా, మూడు చెల్లనివిగా నిలిచాయి.

News December 11, 2025

గుంటూరుని బాల్యవివాహాల రహితంగా మార్చాలి: కలెక్టర్

image

బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆ దిశగా అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. బాల్యవివాహాల అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) వంద రోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షలో మాట్లాడారు.

News December 11, 2025

పోలీస్ డార్మిటరీ భవనాన్ని పరిశీలించిన ఎస్పీ

image

ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ డార్మిటరీ భవనాన్ని ఎస్పీ ప్రతాప్ కిషోర్ గురువారం సందర్శించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్మాణంలో చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన పనులతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత కాంట్రాక్టర్, అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలిచ్చారు.