News September 3, 2024

ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వీ.రత్నతో పాటు పలువురు అధికారులు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఎస్పీ కార్యాలయానికి 63 వినతులు వచ్చాయి. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి అధికారులకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కరిస్తే పదేపదే కార్యాలయం చుట్టూ రారని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2024

‘ఉరవకొండ’ పేరు వెనుక ఇదీ చరిత్ర!

image

ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.

News September 12, 2024

బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News September 12, 2024

విజయవాడ వరద బాధితుల కష్టాలకు చంద్రబాబే కారణం: కేతిరెడ్డి

image

విజయవాడలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం సీఎం చంద్రబాబే అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుడమేరు కాలువకు అధిక మొత్తంలో వరద రాబోతోందని అధికారులు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగాయన్నారు.