News December 3, 2025

ఫిర్యాదులను NCRP పోర్టల్‌లో నమోదు చేయాలి: ఎస్పీ

image

స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సమయం వృథా కాకుండా, ఫిర్యాదులను తక్షణం NCRP పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ డా శబరీష్ సూచించారు. MHBD టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్‌లో రికార్డులు, పెండింగ్ కేసులు పరిశీలించారు.రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా గ్రామలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉండాలన్నారు.

Similar News

News February 10, 2026

మెదక్: మున్సి‘పోల్’ క్లైమాక్స్.. అభ్యర్థుల్లో ఖర్చు టెన్షన్!

image

మున్సిపల్ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. రేపే పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థుల్లో గెలుపు ధీమా కంటే ఖర్చుపైనే ఆందోళన కనిపిస్తోంది. గెలుపు కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు చేయగా, ఇప్పుడు వాటిని తిరిగి ఎలా చెల్లించాలనే టెన్షన్ నెలకొంది. ఒక్కో అభ్యర్థి ఇప్పటికే రూ.10 నుంచి 20 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగియడంతో పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి.

News February 10, 2026

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

image

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News February 10, 2026

ఇంకెన్నాళ్లు కల్తీ రాజకీయం: SV మోహన్ రెడ్డి

image

తిరుమల, శ్రీశైలం దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం కల్తీ అని ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ వివాదంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని, ఇంకెన్నాళ్లు ఈ కల్తీ రాజకీయం చేస్తారని ఆయన మండిపడ్డారు.