News April 11, 2025
ఫూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం: కలెక్టర్

సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావ్ ఫూలే అని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఫూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారన్నారు.
Similar News
News January 17, 2026
ప.గో: పల్లె నుంచి పట్నం బాట

సంక్రాంతి సెలవులు ముగియడంతో జనం పల్లె నుంచి పట్నం బాట పట్టారు. ఉమ్మడి ప.గో జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. శనివారం భీమవరం, ఏలూరులో రద్దీ పోటెత్తింది. విజయవాడ మీదుగా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపారు. ఏలూరులో రాత్రి వేళ కూడా విజయవాడ నాన్‌స్టాప్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరడం రద్దీ తీవ్రతకు అద్దం పట్టింది.
News January 17, 2026
రేగిపండ్లతో లాభాలెన్నో..

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
News January 17, 2026
HYD: ఒకేసారి 20 మంది IPS అధికారుల బదిలీ

ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. DGP ఆదేశాల మేరకు 20 మంది IPSలు బదిలీ అయ్యారు. గజరవు భూపాల్, అభిషేక్ మహంతి, భాస్కరన్, చందనా దీప్తి, అన్నపూరణ, రహుల్ హెగ్డే, అపూరవరవు, బాలస్వామి, వెంకటేశ్వరులు, చైతన్య కుమార్, అవినాశ్ కుమార్, కాజల్, శేషాద్రిని రెడ్డి, కంకనాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, శ్రీనివాసులు, రంజన్ రథన్ కుమార, శ్యామ్ సుందర, అశోక్, బాలకోటి బదిలీ అయ్యారు.


