News December 7, 2025
ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్‌పై ఛార్జిషీట్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.
Similar News
News January 13, 2026
చర్మం పొడిబారి రాలుతోందా?

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్ నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయాలి.
News January 13, 2026
‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.
News January 13, 2026
పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


