News September 10, 2025
ఫేక్ వీడియోలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News December 14, 2025
ములుగు: 44, 794 మంది ఓటేశారు!

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 44,794 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెంకటాపూర్, మల్లంపల్లి, ములుగు మండలాల్లో 54,94 4మంది ఓటర్లు ఉండగా.. మల్లంపల్లిలో 9,196, ములుగులో 16,132, వెంకటాపూర్లో 19,466 మంది ఓటేశారు. రెండో విడత పోలింగ్ శాతం 81.53%గా నమోదయింది.
News December 14, 2025
నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.


