News December 2, 2025

ఫైనల్స్‌కు మహబూబ్‌నగర్- వరంగల్ బాలికల జట్లు

image

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 12, 2026

బలిమెల నీటి వినియోగంపై ఆంధ్రా-ఒడిస్సా జెన్‌కో అధికారుల సమీక్ష

image

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమీక్షించారు. జ‌న‌వ‌రి నెల‌లో బ‌లిమెల జ‌లాశ‌యంలో నీటి వాడ‌కంపై చ‌ర్చించారు. దీని ప్రకారం ఆంధ్ర ఇప్పటి వరకు తన వాటాగా 28.39 టీఎంసీల నీటిని, ఒడిశా 58.28 టీఎంసీల నీటిని వినియోగించుకుంద‌ని నిర్ధారించారు. మిగిలిన వినియోగంపై చర్చించారు.

News February 12, 2026

‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

image

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్‌గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్‌బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్‌గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.

News February 12, 2026

MBNR: అందరి చూపు అటువైపే..

image

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.