News December 2, 2025
ఫైనల్స్‌కు మహబూబ్‌నగర్- వరంగల్ బాలికల జట్లు

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News February 19, 2026
పల్నాడు: బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన కారు

ఎడ్లపాడు హైవే పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళుతున్న ఓ కారు ఆటో, బైక్ ను ఢీకొట్టి, బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తండ్రితో పాటు 10 సంవత్సరాల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2026
అమరావతి: మౌలిక వసతుల కల్పనలో జాప్యం

అమరావతి రాజధాని గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో జాప్యం జరుగుతుందని పలువురు అంటున్నారు. జూన్ నాటికి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే పనులు మొదలు పెట్టకపోవడంతో పాటు గ్రామసభలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.906 కోట్లతో DPRలు సిద్ధం చేశారు. అడుగులు ముందుకు పడకపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారు.
News February 19, 2026
నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.


