News September 20, 2024
‘బంగ్లా’ను కుప్పకూల్చారు
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 149 రన్స్‌కే కుప్పకూల్చారు. బుమ్రా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా 2, సిరాజ్ 2 చొప్పున వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 227 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Similar News
News October 14, 2024
ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ
TG: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొ.సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే నిన్నటి ‘అలయ్ బలయ్’లో పాల్గొనలేదని CPI నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.
News October 14, 2024
భోజనం చేస్తుంటే కాల్పులు జరిపారు: మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 31 మంది కాదని, 35 మంది అని మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ కమిటీ ప్రకటించింది. ‘ఈ నెల 4న భోజనం చేస్తుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఒకే రోజు 11 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, గాయపడిన వారిని మరుసటిరోజు కాల్చి చంపారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం’ అని పేర్కొంది.
News October 14, 2024
నేడే మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.