News April 20, 2024

బంటుమిల్లిలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

image

మండలంలోని నెహ్రూ నగర్‌లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Similar News

News December 12, 2025

దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

image

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

News December 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.