News December 20, 2024

బండారు శ్రావణిపై వైసీపీ సంచలన ఆరోపణ

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై వైసీపీ సంచలన ఆరోపణ చేసింది. ఎమ్మెల్యే తల్లి నీలావతి రూ.5లక్షలకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించింది. ‘ఎమ్మెల్యే శ్రావణి టీడీపీ కార్యకర్తకే వెన్నుపోటు పొడిచారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టునే రూ.5 లక్షలకి అమ్ముకున్నారంటే.. కూటమి నేతల దందాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. సంపద సృష్టిస్తానన్నావ్.. ఇలాగేనా చంద్రబాబూ’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 13, 2025

అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి

image

కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.

News January 13, 2025

శ్రీ సత్యసాయి: 1,668 మందికి ఉద్యోగాలు

image

ధర్మవరంలో గురువారం జరిగిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. 5,120 మంది జాబ్ మేళాకు హాజరు కాగా, 99 కంపెనీల ప్రతినిధులు 1,668 మందిని ఎంపిక చేశారు. వచ్చిన అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.

News January 13, 2025

అనంతపురం జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు

image

అనంతపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్‌లు చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.