News August 11, 2025
బందరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

బందరు కలెక్టరేట్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలని, స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోళ్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలు, క్విజ్‌లు, ఫోటో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
పాత సామాన్ల కొట్టులా మచిలీపట్నం GGH

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (GGH) అధికారుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. చిన్నపాటి మరమ్మతులు ఉన్న బెడ్లు, పాత ఇనుప సామాన్లను పక్కకు తొలగించకుండా ఓపీ నుంచి సర్జికల్ వార్డులకు వెళ్లే ప్రధాన మార్గంలోనే కుప్పగా వదిలేశారు. దీంతో రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News March 5, 2026
కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలకి నెలకు రూ.15-20 లక్షలు ముట్టజెప్పి వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 300 టన్నులకు పైగా పేదల బియ్యం నల్ల బజార్‌కి వెళ్తున్నాయి. స్థానిక మిల్లులోనే పాలిష్ పట్టి సాధారణ బియ్యంలా కాకినాడ పోర్టుకి తరలిస్తున్నట్లు సమాచారం. MTM, పామర్రు,పెనమలూరు కేంద్రాలుగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్నా.. అధికారుల దాడులు మమ అనిపించేలా ఉంటున్నాయి.
News March 5, 2026
కృష్ణా: అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.


