News July 5, 2024

బకాయిలు చెల్లించని షాపులపై అధికారుల కొరడా

image

కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన దుకాణాలను లీజుకు తీసుకుని, అద్దె చెల్లించని షాపులపై నగరపాలక రెవెన్యూ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపిస్తున్నారు. 3 నెలలుగా బకాయిలు చెల్లించని షాపులను సీజ్ చేస్తున్నారు. కమిషనర్ ఏ.భార్గవ్ తేజ ఆదేశాలతో నగరపాలక రెవెన్యూ అధికారులు రెండో రోజు స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. నేడు రూ.12,26,261ను వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

Similar News

News December 12, 2024

నంద్యాల MP ప్రశ్న.. సమాధానం ఇచ్చిన కేంద్రం!

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.

News December 12, 2024

డోన్‌లో మెషీన్‌లో ఇరుక్కుని మహిళ మృతి

image

డోన్‌లోని కోట్లవారి పల్లె సమీపాన రోజు కూలికి వెళ్లే మహిళ ఫ్యాక్టరీ పల్వరైజర్ మెషీన్‌లో ఇరుక్కుని మృతి చెందింది. మృతురాలు డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన లోకేశ్వరమ్మగా స్థానికులు గుర్తించారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 12, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్‌ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితలకు మోసపోయి సైబర్ నేరగాళ్లు వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే, బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.