News August 12, 2025

బజార్హత్నూర్: సంప్రదాయబద్ధంగా నోవోంగ్ పూజలు

image

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. బజార్‌హత్నూర్‌ మండలం అనంతపూర్ (పంగిడి) గ్రామంలోని సిడాం వంశస్థులు మంగళవారం నోవోంగ్ పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు.

Similar News

News March 14, 2026

ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.

News March 14, 2026

భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.