News August 24, 2024
బట్టలభద్ర: డెంగ్యూతో తల్లీకూతురు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జియమ్మవలస మండలం బట్టలభద్ర గ్రామంలో డెంగ్యూ జ్వరంతో 24 గంటల వ్యవధిలో తల్లీకూతురు మృతి చెందడం కలకలం రేపింది. తల్లి మేరువ దుర్గమ్మ (40) కూతురు చైతన్య (20) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందారు. డెంగ్యూ జ్వరాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
Similar News
News January 24, 2026
రేపు ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ముందుగా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ, అనంతరం ఆడిటోరియంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుందన్నారు.
News January 24, 2026
VZM: ‘ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని DRO మురళి అధికారులను శనివారం ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, థియరీ పరీక్షలకు 39,037 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తామన్నారు. జిరాక్స్ షాపులు మూసివేస్తామని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు.
News January 24, 2026
కొత్తవలస రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ రైళ్ల నిలుపుదల

అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పలు అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ సీఎమ్ కె. పవన్ కుమార్ తెలిపారు. రైళ్లు (16597/98, 16223/24, 16107/08, 16523/24) ఇకపై ఇక్కడ ఆగనున్నాయన్నారు. ఈ రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా విజయనగరం, కొత్తవలస, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.


