News November 6, 2025

బడికిరాని విద్యార్థులను తిరిగి తీసుకువచ్చే బాధ్యత CRPలదే: DSE

image

AP: బడికిరాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు తిరిగి స్కూళ్లకు వచ్చేలా CRPలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వెబ్‌ఎక్స్ మీటింగ్‌లో కమిషనర్ సమీక్షించారు. స్కూళ్లకు రాని వారికి హాజరు వేసినట్లు గుర్తిస్తే టీచర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. SSC పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. దీన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.

Similar News

News January 23, 2026

వృద్ధాప్యానికి చెక్‌ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

image

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.

News January 23, 2026

INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

image

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

News January 23, 2026

‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

image

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.