News March 12, 2025

బడ్జెట్‌పై భద్రాద్రి జిల్లా ప్రజల ఆశలు..!

image

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్లో భద్రాద్రి జిల్లా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రోల్లపాడు ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం ముర్రేడు వాగుకు రెండు వైపులా కరకట్టల నిర్మాణం, ఆదివాసీల పోడు సాగుకు విద్యుత్ లైన్ కేటాయింపుకు నిధులు ఆశిస్తున్నారు.

Similar News

News February 13, 2026

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు

image

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 18న ఐఈఎల్టీఎస్ (IELTS) పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 17వ తేదీలోపు నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 13, 2026

కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

image

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

News February 13, 2026

కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి ప్రయోజనం

image

TG: ప్రభుత్వం తీసుకురానున్న <<19121822>>కొత్త హెల్త్ పాలసీ<<>>తో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు 12.84 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ అమలు కోసం సీఎస్ ఛైర్మన్‌గా 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తారు. 515 ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో 1,885 రకాల చికిత్సలు వ్యయపరిమితి లేకుండా అందనున్నాయి. 15 రోజుల్లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.