News March 5, 2025

బతకపల్లిలో బయటపడ్డ పురాతన నాణేలు

image

పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామశివారులోని పెద్దగుట్ట వద్ద ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేపడుతుండగా తవ్వకాల్లో పురాతన నాణేలు బయటపడ్డాయి. ఉర్దూ భాషలో ఉన్న 20 వెండి నాణేలు బయటపడ్డాయి. వెంటనే అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి పెగడపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రవి కిరణ్, ఆర్‌ఐ జమున వాటిని పరిశీలించారు.

Similar News

News December 15, 2025

లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయిపల్లవి

image

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్‌లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News December 15, 2025

NTR: కాలుష్య కోరల్లో నగరం.. CNG, విద్యుత్ బస్సులు వచ్చేనా.?

image

విజయవాడ నగరంలో గతంలో JNNURM పథకం కింద నడిపిన 150 CNG బస్సుల జీవితకాలం ముగియడంతో, వాటి స్థానంలో తీసుకున్న డీజిల్ బస్సుల వల్ల నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ డీజిల్ బస్సుల నుంచి హానికరమైన COవాయువులు, పొగ విడుదలవుతోంది. ఎలక్ట్రిక్ బస్సులు ఖరీదైనప్పటికీ, మరికొన్ని CNG బస్సులైనా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది. దీనివల్ల నగరంలో పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News December 15, 2025

WGL: ఆదివారం కావడంతో తరలివచ్చిన ఓటర్లు

image

రెండో విడత జీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 564 జీపీలకు గాను 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డులు ఏకగ్రీవం కావడంతో 508 జీపీలకు, 4,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.ఆదివారం సెలవు దినం కావడంతో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 7,33,323 మంది ఓటర్ల కోసం 4,638 పీఎస్‌లు, 5,686 పీవోలు, 8,191 ఓపీఓలు, 5,500 మంది పోలీసులు పాల్గొన్నారు.