News November 8, 2025
బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.
Similar News
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
రేపు ఈ పనులు చేస్తే సకల శుభాలు..

కనుమ రోజున పశువులను పూజించి, గ్రామ దేవతలను దర్శించి వారికి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు సొంతమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవాలి. పితృదేవతలను స్మరించుకోవాలి. పిండి వంటల నైవేద్యాలు పెట్టాలి. మద్యానికి దూరముండాలి. ఈ నియమాలు పాటిస్తే కుటుంబానికి, పశుసంపదకు మేలు జరగడమే కాకుండా వాటి నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది’ అంటున్నారు.
News January 15, 2026
సంక్రాంతికి విడుదల.. ఏ సినిమాకు వెళ్లారు?

సంక్రాంతి అనగానే సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండగ వేళ ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘MSVPG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ జాబితాలో ఉన్నాయి. మీరు వీటిలో ఏ సినిమాకు వెళ్లారు? ఏ మూవీ నచ్చింది?


