News November 5, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో నేడు దీపోత్సవం

కార్తీక పౌర్ణమి వేడుకలు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సా.6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని టెంపుల్ ఈవో శేఖర్ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనన్నారు.
Similar News
News January 24, 2026
HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

News January 23, 2026
HYD: ట్రెండింగ్‌లో నైట్ లైఫ్!

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సరికొత్త నైట్ లైఫ్ సెంటర్‌గా మారింది. పగటి ఆఫీసు గొడవలు పక్కనపెట్టి రాత్రుళ్లు భజన రేవ్‌లు, ‘ఫ్లోర్-హాప్’ ఈవెంట్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నో-గ్రైండ్ గ్లో’ పేరుతో హడావుడి చేస్తూ కష్టపడి పనిచేయడం కంటే, లైఫ్‌ను ప్రశాంతంగా గడపడమే ముఖ్యమని చాటిచెబుతున్నారు. షీ-టీమ్స్ నిఘా ఉండటంతో మహిళల సందడి పెరిగింది. దీంతో నగర నైట్ ఎకానమీకి కొత్త ఊపిరి పోస్తోంది.