News April 25, 2025
బల్లికురవ: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నరసరావుపేటలోని 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. బల్లికురవ మండలం వేమవరం గ్రామానికి చెందిన నాగేశ్వర నాయక్‌కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది. 2019 జూలైలో ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో షేక్ ఖాదర్‌ని నాగేశ్వర నాయక్ హత్య చేసినట్లు రుజువైంది. నాలుగేళ్ల విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
Similar News
News March 13, 2026
రేపు కడప జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

కడప జిల్లా వ్యాప్తంగా రేపు (మార్చి 14) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుందనీ, జిల్లాలో మొత్తం 23 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు.
News March 13, 2026
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకొని, పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 13, 2026
రూటు మార్చిన పవన్.. ఆదివాసీల మధ్య వేడుకలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీ రేపటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈసారి వేడుకలను తొలుత పిఠాపురంలో నిర్వహించాలని భావించినప్పటికీ, వివిధ కారణాలతో రద్దు చేశారు. అనంతరం ASR జిల్లా పాడేరు సమీప నందిగురువులో కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. ‘మాటా-మంతి’ కార్యక్రమంలో గిరిజనులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.


