News March 6, 2025

బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి దుర్మరణం

image

నంద్యాల జిల్లా ఆత్మకూరులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీశ్.. ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆత్మకూరులోని కేజీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక వస్తున్న బొలెరో వాహనం తగిలింది. తీవ్రంగా గాయపడిన సతీశ్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News December 9, 2025

వంటింటి చిట్కాలు

image

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.

News December 9, 2025

స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

image

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.

News December 9, 2025

కడప SPని ఆశ్రయించిన ప్రేమ జంట.!

image

తమను చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఓ ప్రేమజంట కడప SPని కలిసింది. వేల్పులకి చెందిన సుష్మాన్ బేగం, కొండూరుకి చెందిన మనోహర్ ప్రేమించుకున్నారు. అనంతరం చీమలపెంట వద్ద ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయించగా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో వారి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదని, తమకు ప్రాణహాని ఉందని SPని ఆశ్రయించారు.