News September 11, 2025

బాంబ్ బ్లాస్ట్ ములుగు జిల్లా వాసికి గాయాలు

image

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తాడ్వాయి మండలం భూపతిపూర్‌కు చెందిన అలం మునేశ్ రెండు కాళ్లు కోల్పోయాడు. గ్రామానికి చెందిన అల్లెం మునేశ్ దంతేవాడ సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం మందు పాతరలు తొలగించేందుకు వెళ్లగా బాంబుపేలి తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్లను వైద్యం కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 15, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్‌కు నో: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డులెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News December 15, 2025

మిరుదొడ్డి: ఆటో డ్రైవర్ నుంచి ఉపసర్పంచ్‌గా..

image

కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు నేడు ఉపసర్పంచ్‌గా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ ఉపసర్పంచ్‌గా 23 ఏళ్ల సోమగల్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10వ వార్డు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన భాస్కర్ అనంతరం ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామస్థులకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

News December 15, 2025

ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

image

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.