News May 22, 2024

బాణసంచా విక్రయాలపై నిషేధం: కలెక్టర్‌

image

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు తూ.గో జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జూన్‌ 4వ తేదీ కౌంటింగ్‌ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2026

రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

image

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News March 13, 2026

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య

image

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. అయితే వైద్యులు రెడ్డి అనంత లక్ష్మికి చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.

News March 13, 2026

రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

image

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.