News February 8, 2025

బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

image

శంషాబాద్‌లో ఇన్‌ఫాంట్ స్కూల్‌ విద్యార్థినిపై బస్‌డ్రైవర్<<15391202>>అసభ్యంగా ప్రవర్తించిన<<>> విషయం తెలిసిందే. ఈనెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్‌లోని సిరినేచర్ రిసార్ట్‌కి పిక్నిక్‌కు వెళ్లిన 6ఏళ్ల బాలికపై బస్‌డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 7, 2026

అన్నమయ్య: వేలాది కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

ములుగు: ప్రియురాలి ఇంటి వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ప్రియురాలి ఇంటి ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లాలో కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌కు చెందిన యువకుడు, కన్నాయిగూడెం మండలం రాజన్నపేటలోని తన ప్రియురాలి ఇంటి వద్దకు చేరుకుని పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 7, 2026

MHBD: మున్సిపల్ ఎన్నికలు.. కో-ఆర్డినేటర్ల నియామకం

image

జిల్లాలోని మున్సిపాలిటీలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయకర్తలను నియమించారు. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. మరిపెడకు ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్‌కు గదార్ల అశోక్, మహబూబాబాద్‌కు వెంకటేష్, కేసముద్రానికి వెంకట్ రమణలను కేటాయించారు. తొర్రూర్ బాధ్యతలను కడియం కావ్య, హనుమంత్ రెడ్డిలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.