News November 29, 2024

బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి: ఎంపీ

image

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Similar News

News December 4, 2024

విశాఖ జూలో జిరాఫీ జంట సందడి

image

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్‌కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

News December 4, 2024

విశాఖలో స్వల్ప భూప్రకంపన..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?

News December 4, 2024

ఈనెల 5న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న విశాఖ వస్తున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. చంద్రబాబు రెండు రోజులు పాటు విశాఖలో ఉండి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)పై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ మంగళవారం పరిశీలించారు.