News August 22, 2024

బాన్సువాడ, బోధన్‌కు నూతన సబ్ కలెక్టర్లు

image

ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పలు సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో 2022 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా కిరణ్మయి కొప్పిశెట్టి, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ సబ్ కలెక్టర్‌గా వికాస్ మహతో నియమితులయ్యారు.

Similar News

News January 24, 2026

నిజామాబాద్: ఎన్నికల అధికారులకు శిక్షణ

image

నిజామాబాద్‌లోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

News January 23, 2026

NZB: 24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు

image

సిద్దిపేటలో జరగనున్న 10వ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల కోసం జిల్లా జట్టు ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయ్ కాంతారావు తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో అండర్-14, 16, 18 విభాగాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 23, 2026

NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

image

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.