News April 24, 2025

బాపట్లలో రేపు ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

image

ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గురువారం పేర్కొన్నారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలో దివ్యాంగులు, ఎస్టీలు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు రావచ్చన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News March 17, 2026

బాపట్ల రైతులకు JC సూచనలు

image

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.

News March 17, 2026

MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

image

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.

News March 17, 2026

తాడేపల్లిగూడెం: ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్

image

తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రౌతు రామకృష్ణ మంగళవారం ఏసీబీ వలలో చిక్కారు. స్థలం సర్వే రిపోర్టుకు యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మున్సిపల్ సర్వేయర్, ఇంచార్జ్ డివిజనల్ సర్వేయర్‌గా పనిచేస్తూ రామకృష్ణ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్, సిబ్బంది, కుటుంబీకులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.